భారత 15వ ప్రధానిగా నరేంద్ర మోడీ

Was sworn in as Prime Minister Narendra Modi


 న్యూఢిల్లీ:  భారత రాజకీయాల్లోనూ దేశ చరిత్రలోనూ నవ శకానికి తెర లేచింది. మోడీ శకం ఘనంగా మొదలైంది.  ప్రజలంతా అత్యంత ఆసక్తితో, ఆనందోత్సాహాలతో టీవీ లకు అతుక్కుపోయి చూస్తుండగా, ఇరుగు పొరుగు దేశాధినేతల సమక్షంలో  దామోదర్‌దాస్ మోడీ (63)కి అత్యంత ఘనంగా పట్టాభిషేకం జరిగింది. దేశ 15వ ప్రధానమంత్రిగా సోమవారం సాయంత్రం ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు.

గత సెప్టెంబర్‌లో బీజేపీ ప్రధాని అభ్యర్థి హోదాలో మొదలు పెట్టిన రాజకీయ జైత్రయాత్రను దిగ్విజయంగా ముగించుకుని హస్తిన పీఠంపై ఆసీనుడయ్యారు.. రాష్ట్రపతి భవన్ ఆవరణలో మున్నెన్నడూ లేనంత భారీ స్థాయిలో, అంగరంగ వైభవంగా 90 నిమిషాల పాటు జరిగిన ప్రమాణ స్వీకారోత్సవం ఆద్యంతం కన్నులపండువ చేసింది. జాతీయ గీతాలాపన అనంతరం మోడీతో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రమాణ స్వీకారం చేయించారు

45 మంది మంత్రులతో కేంద్రంలో మోడీ నేతృత్వంలో బీజేపీ సారథిగా ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం కొలువుదీరింది. అయితే ఇది పేరుకు మాత్రమే సంకీర్ణం. తన మాయాజాలం సాయంతో బీజేపీకి సొంతంగానే మెజారిటీ సాధించిపెట్టడం ద్వారా మూడు దశాబ్దాల సంకీర్ణ శకానికి మోడీ ముగింపు పలకడం తెలిసిందే. అయినా కూటమి మర్యాదకు పెద్దపీట వేస్తూ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు కూడా ప్రభుత్వంలో ఆయన ప్రాతినిధ్యం కల్పించారు.
 చంద్రబాబు కేసీఆర్, కూడ హాజరు
మోడీ ప్రమాణ స్వీకారానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి పలు పార్టీల అధినేతలు, ఎంపీలు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. , టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ ఎంపీలు, టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ ఎంపీలు, బీజేపీ ఎంపీలు హరిబాబు, గోకరాజు గంగరాజు, బండారు దత్తాత్రేయ, బీజేపీ సీనియర్ నేత మురళీధర్‌రావు, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ, బాబు తనయుడు నారా లోకేశ్ తదితరులు హాజరయ్యారు.

Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment