టీవీ యాంకర్తో దిగ్విజయ్ పెళ్లి!

digvijay second marriage

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఓ టీవీ యాంకర్తో సన్నిహితంగా ఉన్న ఫొటోలు ఇంటర్ నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. సదరు టీవీ యాంకర్ అమృతారాయ్ ను డిగ్గీ రాజా పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నారట. ఈ విషయాన్ని దిగ్విజయే స్వయంగా ట్విట్టర్లో ప్రకటించారు. దిగ్విజయ్ భార్య ఆశాసింగ్ గతేడాది క్యాన్సర్ తో మరణించారు.  టీవీ యాంకర్ అమృతారాయ్ కలిసిన సోషల్ మీడియాలో దర్శనమివ్వడంతో దిగ్విజయ్ స్పందించారు. 'అవును ... నిజమే... నేను ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను' అని అంగీకరించారు. 'అమృతారాయ్ ప్రస్తుతం భర్తతో విడాకులు తీసుకోబోతుంది. అది జరిగాక నేను ఆమెను వివాహం చేసుకుంటాను' అని దిగ్విజయ్ ట్విట్టర్ లో ప్రకటించారు. అమృతారాయ్ కూడా ఇదే అర్థం వచ్చేలా ట్వీట్ చేశారు. దీంతో సోషల్ మీడియాలో పుట్టిన కాంట్రవర్సీకి దిగ్విజయ్ సోషల్ మీడియాలోనే ఫుల్ స్టాప్ పలికారు. ఏదేమైనా జరుగుతున్న ఎన్నికలపై ఈ సంఘటన కాంగ్రెస్ పార్టీపై ఏ మేరకు ప్రభావం చూపనుందో!!
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment