బిజెపిలో చేరిన కావూరి సాంబశివరావు

kavuri joined in bjp

కేంద్ర మాజీ మంత్రి  కావూరి సాంబశివరావు గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ సమక్షంలో బీజేపీలో చేరారు. భారత్ విజయ్ బహిరంగ సభా వేదికపైకి వచ్చిన కావూరి మోడీని భారీ పూల మాలతో సత్కరించారు. ఈ సందర్భంగా కావూరి మాట్లాడుతూ దేశానికి ప్రధాని కాగల అర్హత మోడీకి ఉందన్నారు. దీర్ఘకాలం పాటు కాంగ్రెస్ లో కొనసాగిన  కావూరి రాష్ట్ర విభజన నేపథ్యంలో కొద్దిరోజుల క్రితం కేంద్రమంత్రి పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తర్వాత టీడీపీలో చేరేందుకు ప్రయత్నించి విరమించుకున్నారు. చివరగా బీజేపీలో చేరారు!!
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment