మనం'కు మంచి స్పందన


manam movie good responce

అక్కినేని ఫ్యామిలీ చిత్రం 'మనం'కు ప్రేక్షకుల నుంచి ఆదరణ లభిస్తోంది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు పుంజుకుంటున్నాయి. శుక్రవారం విడుదలైన మనం చిత్రం తొలి రెండు రోజుల్లో దేశ వ్యాప్తంగా 4.02 కోట్ల రూపాయిలు వసూలు చేసింది.  అమెరికాలో 1.17 కోట్ల రూపాయిలు రాబట్టింది.

ఈ సినిమాలో అక్కినేని కుటుంబంలో మూడు తరాలకు చెందిన వారు నటించారు. అక్కినేని నాగేశ్వరరావు నటించిన చివరి చిత్రం ఇదే. నాగేశ్వరరావు కుమారుడు, నాగార్జున, మనవళ్లు నాగ చైతన్య, అఖిల్ ఈ సినిమాలో నటించారు. కాగా కేన్సర్ తో బాధపడ్డ నాగేశ్వరరావు ఈ సినిమా విడుదలకు ముందే మరణించిన సంగతి తెలిసిందే.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment