థర్డ్ ఫ్రంట్ దిశగా టీఆర్ఎస్

తెలంగాణలో ఎన్నికలు ముగిసిన తర్వాత టీఆర్ఎస్ తన భవిష్యత్ ప్రణాళికను సిద్ధం చేసుకుంటోంది. రాష్ట్రంలో అధికారం చేపట్టడం ఖాయమనే ధీమాతో ఉన్న టీఆర్ఎస్ కేంద్రంలోనూ చక్రం తిప్పేందుకు సన్నద్ధమవుతోంది. థర్డ్ ఫ్రంట్ దిశగా అడుగులు వేస్తోంది. ఆ పార్టీ సెక్రటరీ జనరల్ గా ఉన్న రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు ఈ ప్రయత్నాలు ఆరంభించారు. ఆయన పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీని కలవడానికి కోల్కతా వెళ్లారు. మూడో ఫ్రంట్ కు మద్దతు ఇచ్చే విషయమై ఆమెతో సంప్రదింపులు జరుపుతారు. కాంగ్రెస్, ఎన్డీఏలకు కాకుండా ఒకవేళ మూడో ఫ్రంటె ఏర్పడితే తమ మద్దతు వారికి ఇవ్వవచ్చన్న ఆలోచనలో టీఆర్ఎస్ ఉంది.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment