100 స్మార్ట్ సిటీలను నిర్మిస్తాం:వెంకయ్య

we will make 100 smart citys:venkya

న్యూఢిల్లీ : కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా వెంకయ్య నాయుడు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం వెంకయ్యనాయుడు మీడియాతో  మాట్లాడుతూ దేశంలో 100 స్మార్ట్ సిటీలను నిర్మిస్తామని ప్రకటించారు. రానున్న రోజుల్లో శాటిలైట్ టౌన్ షిప్ లు నిర్మిస్తామన్నారు. ప్రజా రవాణా వ్యవస్థను ప్రోత్సహిస్తామని ఆయన అన్నారు. దేశంలో ఈ పదేళ్లలో క్లాస్ 1 నగరాలు 394 నుంచి 468కి పెరిగాయన్నారు. పేదలకు పట్టణాల్లో ఆవాసాలు కల్పిస్తామని తెలిపారు.
 పట్టణ ప్రాంతాల్లోని 43శాతం ప్రజలు మెట్రో నగరాల్లో నివసిస్తున్నారని వెంకయ్య పేర్కొన్నారు. 2015 నాటికి సగం జనాభా పట్టణాల్లో నివసిస్తారనే అంచనా ఉందన్నారు. 2020 నాటికి దేశంలో ప్రజలందరికీ పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తామని వెంకయ్య హామీ ఇచ్చారు..

Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment