అసెంబ్లీలో సీఎం కేసీఆర్ మాటాలు

 Assembly cm kcr Speak

 పంటరుణాలతో పాటు రైతుల బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న పంటరుణాలూ రద్దు చేస్తాం.  26లక్షల రైతు కుటుంబాలకు లబ్ధి.సాగునీటిలో వాటా కోసం ట్రిబ్యునల్ ముందు నేనే వాదిస్తా. గొలుసుకట్టు చెరువుల్ని పునరుద్ధరిస్తాం. గ్రావిటీ కమ్ లిఫ్టుల ద్వారా కోటి ఎకరాలకు సాగునీరు. తెలంగాణ విద్యార్థులకే ఫీజులు చెల్లిస్తాం. హైదరాబాద్‌లో చదివే సీమాంధ్ర పిల్లలకు ఫీజులెందుకిస్తాం? మూడేళ్లలో మిగులు విద్యుత్ సాధిస్తాం. ఇకపై ప్రైవేట్ విద్యుత్ సంస్థలతో వ్యాపారం చేయబోం.  పోలవరంపై ఢిల్లీకి అఖిలపక్షం. ఆర్డినెన్స్ ఉపసంహరణకు కేంద్రంపై ఒత్తిడి తెద్దాం. రేషన్‌కార్డులు, హౌసింగ్ అక్రమాలపై కఠిన చ ర్యలు. అమరుల కుటుంబాలకు ఏం చేసినా తక్కువే 1969 ఉద్యమ అమరులనూ ఆదుకుంటాం.పెన్షన్ల పెంపు భారమే అయినా అమలు చేస్తాం. మానవతా దృక్పథంతో బీడీ కార్మికులకు వెయ్యి భృతి. గిరిజనులు, మైనార్టీలకు రిజర్వేషన్ల అమలు ఆచరణ సాధ్యమే. ఇందుకు తమిళనాడు తరహా చట్టాన్ని తెస్తాం.వెనుకబడిన వర్గాల సంక్షేమానికి పెద్దపీట. అందుకే ఆ శాఖలు నావద్దే రూ. లక్ష కోట్లు ఖర్చు పెడతాం. ఇక్కడి ఉద్యోగులు ఇక్కడే ఉంటారు.రాజకీయ అవినీతిపై నిక్కచ్చిగా వ్యవహరిస్తాం.విశ్వ నగరంగా హైదరాబాద్. మెట్రో అలైన్‌మెంట్‌ని మార్చుతాం.అని కేసీఆర్  చెప్పారు.


Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment