దూకుడు పెరిగితే ఆగడు!

Despite the allegedly aggressive

శ్రీను వైట్ల. ఆయన దర్శకత్వంలో మహేష్ కథానాయకుడిగా రూపొందుతున్న చిత్రం ఆగడు. తమన్నా కథానాయిక. జి.రమేష్‌బాబు సమర్పణలో 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కష్ణ పుట్టిన రోజుని పురస్కరించుకుని ఈ సినిమా ఫస్ట్ట్‌లుక్ టీజర్‌ను శనివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా శ్రీను వైట్ల మాట్లాడుతూ దూకుడు పెరిగితే ఆగని ఓ పవర్‌ఫుల్ పోలీస్‌స్టోరీ ఇది. మహేష్‌బాబు నటన, అతని పాత్ర చిత్రణ ఆగడులో మెయిన్ హైలైట్. వంద శాతం హీరోయిజమ్‌తో సాగే సినిమా ఇది. సినిమా ప్రభావం జనాల మీద ఎంతుందో తెల్దుగానీ...పంచ్ డైలాగుల ప్రభావం గట్టిగా వుంది. ప్రతీ ఓడు పులులు..సింహాలు..ఏనుగులు ఎలకలతో ఎదవ కంపేరిజన్స్‌కి ఎలపరమొచ్చేత్తోంది అంటూ ఆగడు ఫస్ట్‌లుక్ టీజర్‌లో మహేష్ చెప్పిన డైలాగ్‌లకు ప్రేక్షకుల నుంచి, అభిమానుల నుంచి విశేష స్పందన లభిస్తోంది అన్నారు మహేష్‌ని ఇంతకు ముందు చూడని కొత్త కోణంలో చూస్తారు. ఆయన కామెడీ టైమింగ్ ఆకట్టుకుంటుంది. మహేష్ సినిమాల్లోనే నెంబర్‌వన్ సినిమాగా నిలుస్తుంది అన్నారు. . సెప్టెంబర్‌లో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం అన్నారు.

Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment