న్యూయార్క్ తరహాలో తెలంగాణ రాష్ట్ర పోలీస్ వ్యవస్థ సీఎం

New York lines telangana state police System cm

రాష్ట్రంలోని పోలీస్ వ్యవస్థ న్యూయార్క్ తరహాలో ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతాధికారులకు సూచించారు. ప్రధానంగా గ్రేటర్ పరిధిలోని పోలీసుల యూనిఫామ్ న్యూయార్క్ పోలీసుల తరహాలో ఉండేలా నెల రోజుల్లో డ్రెస్ కోడ్ మరచలని ఆదేశించిన సిఏం . సీఎం కేసీఆర్ సచివాలయంలో పోలీసు ఉన్నతాధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు.
ఈ సమావేశంలో రాష్ట్రంలోని పోలీస్ వ్యవస్థను అంతర్జాతీయ ప్రమాణాలతో పటిష్టం చేయాలని అధికారులను ఆదేశించారు. పోలీస్ వ్యవస్థలో ఒకే రకమైన కంట్రోలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని పోలీసు ఉన్నతాధికారులకు సూచించారు. దీనికోసం రూ.300 కోట్లతో 1,650 ఇన్నోవాలు, 1,600 బైకులు కొనుగోలు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశానికి హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డితోపాటు డీజీపీ, సీపీలు హాజరయ్యారు.

Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment