బాలకృష్ణ 98వ సినిమా

balakrishna 98 movei

హైదరాబాద్‌:సోమవారం హైదరాబాద్‌లో ఈ చిత్రం ఘనంగా ప్రారంభమైంది. కె.రాఘవేంద్రరావు పూజా కార్యక్రమాలు నిర్వహించగా, బాలకృష్ణపై చిత్రీకరించిన ముహూర్తపు దృశ్యానికి రమేశ్‌ప్రసాద్ కెమెరా స్విచాన్ చేయగా, దాసరి క్లాప్ ఇచ్చారు. బి. గోపాల్ గౌరవ దర్శకత్వం వహించారు. సత్యదేవ్ మాట్లాడుతూ బాలకృష్ణ గారి కోసమే తయారు చేసుకున్న కథ ఇది. బాలకృష్ణ... తన 98వ సినిమాకు కొబ్బరికాయ కొట్టారు. ఈ చిత్రం ద్వారా సత్యదేవ్ అనే కొత్త దర్శకునికి ఆయన అవకాశం ఇవ్వడం విశేషం. ఎస్.ఎల్.వి. సినిమా పతాకంపై రుద్రపాటి రమణారావు నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన తొలిసారి త్రిష కథానాయికగా నటించనుండటం మరో విశేషం. గన్ నుంచి బయటకొచ్చిన బుల్లెట్ ఎంత శక్తిమంతంగా, ఫోర్స్‌గా ఉంటుందో ఇందులో బాలయ్య పాత్ర అంత శక్తిమంతంగా ఉంటుంది లెజెండ్  లాంటి సూపర్‌ హిట్ తర్వాత, అందునా బాలయ్యగారు ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే.. నా సినిమానే చేయడం చాలా గర్వంగా ఉంది.ఇప్పటికే అద్భుతమైన మూడు ట్యూన్స్‌ని రెడీ చేశారు కూడా. అలీ కామెడీ ఈ చిత్రానికి మరో హైలైట్ అని చెప్పారు.

 

Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment