ఇక ఎఫ్‌ఎం రేడియోల్లోనూ వార్తలు

న్యూఢిల్లీ: ప్రైవేటు రంగంలోని ఎఫ్‌ఎం రేడియోలకు వార్తలు ప్రసారం చేసేందుకు అనుమతివ్వాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నది. రేడియో వార్తలను ఒక్క ఆలిండియా రేడియోకు మాత్రమే ఎందుకు పరిమితం చేయాలి? ఎఫ్‌ఎం రేడియోలకూ వార్తాప్రసారాలు చేసే వెసులుబాటు కల్పించే దిశగా మేం ఆలోచన చేస్తున్నాం అని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా మరో 200 ప్రధానపట్టణాలకు ఎఫ్‌ఎం సేవలను విస్తరించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా కమ్యూనిటీ రేడియోస్టేషన్‌లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. గత యూపీఏ ప్రభుత్వం ఎఫ్‌ఎం సేవల విస్తరణకు సంబంధించిన మూడోదశ విధివిధానాలను సిద్ధం చేసింది. అందులో వార్తాప్రసారాలకు అనుమతించే అంశం కూడా ఉంది. ఇప్పటికే ఈ దశ అమలు చాలా ఆలస్యమైంది. త్వరలోనే మూడోదశ విధివిధానాలను అమల్లోకి తెస్తామని కేంద్ర సమాచార పౌరసంబంధాల శాఖ సెక్రటరీ బిమల్ జుల్కా తెలిపారు.

Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment