నందిగామ ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకర్ కన్నుమూశారు

 nadhigama mla thamgirala Prabhakar died

విజయవాడ: కృష్ణాజిల్లా నందిగామ టీడీపీ ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకరరావు { 64 } ఆదివారం అర్ధరాత్రి గుండెపోటుతో మరణించారు.. రాత్రి 11.30 గంటల సమయంలో ఆయనకు గుండెపోటు రాగా కుటుంబసభ్యులు వెంటనే స్థానిక మదర్‌థెరిస్సా ఆస్పత్రికి  తరలించారు. రాత్రి 12 గంటల సమయంలో ఆయన తుదిశ్వాస విడిచారు. కంచికచర్ల మండలం పరిటాలకు చెందిన ఆయన న్యాయవాద వృత్తి నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. అంతకుముందు వీరులపాడు జెడ్పీటీసీగా, ఎంపీపీగా పనిచేశారు. టీడీపీ ప్రారంభం నుంచి ఆ పార్టీలో కొనసాగుతున్న ప్రభాకర్ 2009 లో తొలిసారిగా నందిగామ ఎస్సీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రెండోసారి అదే నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఆదివారం ఉదయమే ఆయన మంత్రి దేవినేని ఉమామహేశ్వరావుతో కలసి పులిచింతల ప్రాజెక్టును సందర్శించారు.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment