పవన్ మోడీని ప్రశ్నించబోతున్నారా?

pawan modi asking a question

ప్రముఖ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ 2014 సార్వత్రిక ఎన్నికలలో, పోటి చేద్దమను అనుకుండు కాని ఒట్లు చిలిపోతాయని  ఎన్నికలలో నిలబడకుండా టిడిపి-బిజెపి పొత్తుకు మద్దతుగా ఆయన చేసిన ప్రసంగాలు ఎంతో సంచలనం సృష్టిచాయి. కాగా తనకు అధికారం ముఖ్యం కాదని ఏ పార్టీ తప్పు చేసినా ప్రశ్నించడానికి తయారుగా ఉన్నానని పవన్ ఎప్పుడో స్పష్టం చేసారు. అయితే ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం,భాజపా పార్టీల పొత్తు భారీ విజయం నమోదు చేసుకోవడానికి పవన్ కూడా ఒక కారణం అనడంలో అతిశయోక్తి లేదు. ఇక స్వయంగా ప్రధాని నరేంద్రమోడినే ఫోన్ చేసి మరీ పవన్ కు కృతజ్ఞ్యతలు తెలిపారంటే అతని రేంజ్ ఏమిటో చెప్పాల్సిన అవసరం లేదు.అయితే ఎవరినైనా ప్రశ్నించడానికి రెడీ అంటూ జనసేన పార్టీని స్థాపించిన పవన్ కు ఇప్పుడు ప్రశ్నించే అవకాశం వచ్చిందని రాజకీయవర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. ఇటీవల రైల్వే చార్జీలను అమాంతం పెంచేసిన మోడీ సర్కారు దేశవ్యాప్తంగా నిరసనలను ఎదుర్కుంటున్న నేపధ్యంలో పవర్ స్టార్ ఈ అంశంపై ప్రధాని మోడీని ప్రశ్నించడానికి తయారవుతున్నారన్న వార్తలు రాజకీయవర్గాలలో షికార్లు చేస్తున్నాయి. మరి ఎన్నికలలో తన పూర్తి మద్దతును ప్రకటించిన మోడీని పవన్ ప్రస్నిస్తారో లేదో, ఒకవేళ ప్రశ్నిస్తే అందుకు మోడీ ఏమి సమాధానం చెప్తారో తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment