పవర్ స్టార్ సిటీలో లేకుంటే పవర్ కట్ చేస్తారా..?

power star city if power cut Do you ..?

ఇటీవల సినీనటుడు బ్రహ్మాజీ ఓ ఆసక్తికరమైన.. హాస్యంతో కూడిన ట్వీట్ చేశారు. గత కొద్ది రోజులుగా నగరంలో ఎక్కువైపోయిన పవర్ కట్ లను ఉద్దేశించి బ్రహ్మాజీ ట్వీట్ చేశాడు. బ్రహ్మాజీ చేసిన ట్వీట్ చాలా మందిని ఆకట్టుకుంది.  . పవర్ స్టార్ సిటీలో లేకపోతే పవర్ కట్ చేస్తారా..?  అంటూ బ్రహ్మాజీ చేసిన ట్వీట్ పై చాలా రకాలుగానే చర్చ మొదలైంది. పవర్ కట్ ల బాధను తట్టుకోలేకనే ట్వీట్ చేశారా లేక.. జనాల అటెన్షన్ ను సొంత చేసుకోవడానికే పవర్ స్టార్ పేరును ట్వీట్ లో ఉపయోగించుకున్నారా ప్రశ్నలు మొదలయ్యాయి.  అయితే తనకు ఎవర్ని ఆకట్టుకోవాల్సిన అవసరం లేదని.. జస్ట్ ఫర్ ఫన్ కోసమే ట్వీట్ చేశాను అని బ్రహ్మజీ వివరణ ఇచ్చారు. ట్వీట్ లు.. ఫేస్ బుక్ లో సందేశాలు పోస్ట్ చేసే నెటిజన్లు కాస్తా జాగ్రత్తగా ఉండాల్సిందే మరి..మొబైల్ ఫోన్లలో సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత మనసులోని భావాల్ని ఇతరులతో పంచుకోవడం చాలా సులభం, సర్వసాధారణమైపోయింది. తమ అభిప్ర్రాయలను ఇతరులతో పంచుకోవడం  ఫ్యాషనైపోయింది కూడా.. సోషల్ మీడియాలో సెలబ్రిటీలు, ప్రముఖులు కూడా చేరిపోవడం.. వాళ్లు పోస్ట్ చేసే సందేశాలకు కూడా మంచి క్రేజ్ లభిస్తోంది. 
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment