త్రివిక్రమ్ తో మహేష్ మరో సినిమా

trivkarm Cum mahesh Another Movie

ఓ ప్రైవేట్ ఫంక్షన్ లో పాల్గొన్న మహేష్ స్టూడెంట్స్ తో మాట్లాడుతూ కొరటాల శివ చిత్రం తర్వాత త్రివిక్రమ్ తో ఓ సినిమా చేయడానికి ఒప్పుకున్నాను అని టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అన్నారు. ఇంతక ముందే  త్రివిక్రమ్ శ్రీనివాస్ తో అతడు వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని చేసాడు ఇప్పటికి బుల్లితెరపై అది సంచలనమే సృష్టిస్తోంది. అది ఎప్పుడు ప్రసారమైనా మంచి రేటింగ్ తో దూసుకు పోతోంది. ఇక రెండో సినిమా ఖలేజా అనుకున్న విజయం సాధించక పోయినప్పటికీ మహేష్ లోని మరో యాంగిల్ ని చూపించే అవకాశం లభించింది. త్వరలోనే ఆగడు ని కంప్లీట్ చేసి కొరటాల శివ సినిమా ప్రారంభించనున్నాడు మహేష్ . ఆ తర్వాత త్రివిక్రమ్ సినిమా ఉంటుంది ,త్రివిక్రమ్ తో సినిమా అంటే మహేష్ అభిమానుల ఆనందానికి హద్దే ఉండదు.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment