ఉదయ్‌కిరణ్ నటించిన చివరి చిత్రం

 uday kiran last movei chitram-cheppina-katha

 ఉదయ్‌కిరణ్ నటించిన చివరి చిత్రం చిత్రం చెప్పిన కథ.ఉదయ్‌కిరణ్ దగ్గర మేనేజర్‌గా పనిచేసిన సి.హెచ్.మున్నా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మోహన్ .ఎ.ఎల్. ఆర్.కె దర్శకుడు. డింపుల్, మదాలసశర్మ, గరిమ కథానాయికలు. నువ్వు-నేను ఫేమ్ అనిత ప్రత్యేక పాత్రలో నటిస్తోంది. మున్నా కాశీ సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియోను మల్టీడైమెన్షన్ వాసు విడుదల చేశారు. తొలి ప్రతిని ఉదయ్‌కిరణ్ భార్య విషిత స్వీకరించారు. ఈ సందర్భంగా విషిత మాట్లాడుతూ ఉదయ్ జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి. మేనేజర్ నుండి నిర్మాతగా మారి నేను చేస్తున్న ఈ సినిమా ఉదయ్‌కిరణ్ ఆఖరి సినిమా అవుతుందనుకోలేదు. ఉదయ్ నేనూ మంచి మిత్రులం. తను మా నుంచి దూరమవ్వడం విధిచేసిన మాయ. ఈ సినిమాను పెద్ద హిట్ చేసి ఉదయ్‌కి ఘన నివాళి ఇవ్వాలి అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ఉదయ్‌తో పనిచేసిన అనుభవాన్ని మర్చిపోలేను. సినిమాలే అతని లోకం. మంచి హిట్ సినిమాలతో మన హదయాల్లో నిలిచిపోయిన ఉదయ్ మన మధ్య లేకపోవడం బాధాకరం అన్నారు. ఉదయ్‌కిరణ్ నటించిన గత చిత్రాలకు ఏ మాత్రం తీసిపోకుండా చక్కటి సంగీతం అందించాను. ఆడియో, సినిమా పెద్ద హిట్టవ్వాలి అని సంగీత దర్శకుడు మున్నా కాశీ తెలిపారు.

Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment