ఆర్నెల్లలో హైదరాబాదంతా 4జీ వైఫై!

4g-wi-in-telangana-in-6-months
సెప్టెంబర్ నెలాఖరులోగా గ్రేటర్ నగరంలోని వెస్ట్‌జోన్.. పర్యాటక ప్రాధాన్యం కలిగిన ప్రాంతాల్లోనూ.. డిసెంబర్ నెలాఖరు నాటికి రాజధాని నగరంలోని ప్రజలందరికీ 4జీ వైఫై సేవలు అందుబాటులోకి రానున్నాయి. దశలవారీగా రాష్ట్రమంతటికీ ఈ సేవలు విస్తరించనున్నాయి. గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్ ‘4జీ వైఫై నగరంగా హైదరాబాద్’ అనే అంశంపై ఐటీ మంత్రి కేటీఆర్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్, సీఎంఓ ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, ప్రత్యేక కార్యదర్శి స్మితాసబర్వాల్ తదితరులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తెలంగాణలో వైఫై సేవ ల కోసం తాము  రూ. 4,100 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్ నగరంలోనే 1,700 కి.మీ.ల ఓఎఫ్‌సీ లైను వేస్తున్నామని, ప్రస్తుతం 500 కి.మీ. మేర పనులు పూర్తయ్యాయని చెప్పారు. 4జీ వైఫై సేవల కనెక్షన్లకు నెలకు దాదాపు రూ. 1,200 వసూలు చేసేందుకు రిలయన్స్ ప్రతిపాదించినట్లు సమాచారం.
Share on Google Plus
  Blogger Comment
  Facebook Comment

1 comments:

 1. Reliance ....vasoollu manam maatlaada koodadu.
  once upon a time bapu gari cartoon okati gurthosthondi.
  " mana rashtram lo carla factory pedunnaaruta" daani per puaru.
  Hyderabad lo 4 g sevalu......idee anthe .

  ReplyDelete