రైతులు దొంగలంట:చంద్రబాబు

 The-thief-farmers-Chandrababu

అనంతపురం: నిజమైన రైతులకు రూ.1.50 లక్షల కన్నా ఎక్కవ అప్పు ఉండదు.ఒక వెల అంతకంటే ఎక్కువె వుంటే వారు నిజమైన రైతులు కాదు.వారు దొంగ రైతులు అని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు  చెప్పారు.  రూ.1.50 లక్షల కన్నా ఎక్కవ తీసుకున్న వారిలో   వైఎస్సార్‌సీపీ వారే ఎక్కువగా వున్నారు . అందుకే రుణాన్ని మొత్తం మాఫీ చేయలేదనే అక్కసుతో నానాయాగీ చేస్తూ నా దిష్టిబొమ్మలను తగలబెడుతున్నారు. అలాంటివారి బెదిరింపులకు నేను భయపడను అని బాబు అన్నాడు.

రెండు రోజుల పర్యటనలో భాగంగా జిల్లాకు వచ్చిన ఆయన రెండో రోజైన శుక్రవారం కదిరి పట్టణంలోని కుటాగుళ్ల మున్సిపల్ స్కూల్‌లో ‘బడి పిలుస్తోంది’ కార్యక్రమం ప్రారంభోత్సవం, ధర్మవరం నియోజకవర్గంలోని ముదిగుబ్బలో జరిగిన కార్యక్రమంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా రాజధాని నిర్మాణానికి ఉరవకొండ నియోజకవర్గానికి చెం దిన అనంతయ్య అనే కార్యకర్త రూ.10 లక్షల చెక్కు, బుక్కరాయసముద్రం మండలానికి చెందిన టీడీపీ కార్యకర్త మల్లికార్జునరెడ్డి రూ.50 వేల చెక్కును సీఎంకు అందజేశారు

Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment