ఏపీ రాజధాని గుంటూరు- కృష్ణా మధ్యే

ap capital gunturu-krishna between

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన రాజధానికి గుంటూరు- కృష్ణా  జిల్లాల మధ్య ప్రాంతం అన్నివిధాలా అనుకూలంగా ఉంటుందని శివరామకృష్ణన్ కమిటీకి వివరించినట్టు రాజధాని ఏర్పాటు సలహా కమిటీ చైర్మన్, ఏపీ పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పి.నారాయణ వెల్లడించారు. కృష్ణా-గుంటూరు మధ్యలో రాజధాని ఏర్పాటు చేస్తే ఉత్తర కోస్తా, రాయలసీమ జిల్లాలకు సమాన దూరంలో ఉండడంతోపాటు నీటి వసతి, విమానా శ్రయాలు, రైలు, రోడ్డు సదుపాయాలు అందుబాటులో ఉంటాయని వారికి వివరించామన్నారు. రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలన్న దానిపై వచ్చే నెలాఖరున శివరామకృష్ణన్ కమిటీ నివేదిక ఇవ్వనున్నరు.. రాజధాని ఎక్కడన్న అంశంపై తుది నిర్ణయం తీసుకునే ముందు బిల్లులో పేర్కొన్నట్టు రాష్ట్రానికి ఇచ్చిన 11 జాతీయ సంస్థలు ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోందన్న అంశాలను కమిటీకి వివరించాం. విజయనగరంలో ట్రైబల్ యూనివర్సిటీ, కాకినాడలో పెట్రోలియం యూనివర్సిటీ, విశాఖపట్నంలో ఐఐఎం, 13 జిల్లాలకు మధ్యలో ఉండేలా ఎయిమ్స్‌ను, ఐఐటీని తిరుపతిలో, అనంతపురం- కర్నూలు మధ్యలో ఐఐఐటీ, కర్నూలులో ఎన్‌ఐటీ, విజయవాడలో సెంట్రల్ యూనివర్సిటీ, వెస్ట్ గోదావరిలో అగ్రికల్చర్ యూనివర్సిటీ పెట్టాలని రాష్ట్రప్రభుత్వం సూచనప్రాయంగా నిర్ణయించిన అంశాలను శివరామకృష్ణన్ కమిటీ దృష్టికి తెచ్చాం
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment