ఎపి పరువు తీసిన బాబు

ap dignity taken babu

ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనకు తొమ్మిదేళ్ల అనుభవం ఉందని చెప్పుకున్నారని, కాని రాజధాని నిర్మాణం అంటూ హుండీలు పెట్టి రాష్ట్రం పరువు తీశారని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ విమర్శించింది. ఆ పార్టీ అదికార ప్రతినిది అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ అనుభవం కలిగిన వ్యక్తి చేయవలసిన పనేనా ఇది అని ప్రశ్నించారు.చంద్రబాబు పాలన తుగ్లక్ పాలన మాదిరిగా ఉందని ఆయన ధ్వజమెత్తారు. హుండీలు పెట్టే హక్కు దేవాదాయశాఖకు మాత్రమే ఉందన్నారు.చంద్రబాబు తన ప్రమాణ స్వీకారానికి 30 కోట్ల రూపాయలు, చాంబర్ కోసం 23 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారని, చంద్రబాబుకు ఓటేసింది హుండీలు పెట్టి, డబ్బు అడగటం కోసం కాదని అంబటి వ్యాఖ్యానించారు. 
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment