తెలుగు వారిని ఆందోళనకు గురిచేస్తున్న ప్రమాదాలు


హైదరాబాద్ః రెండు తెలుగు రాష్ర్టాల ప్రజలను ప్రమాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. దీంతో ఇరు రాష్ర్టాల ముఖ్యమంత్రులు ఆందోళన చెందుతున్నారు. గత రెండు మాసాల నుంచి ఇరు రా ష్ర్టాల ప్రజల ఏదో ఒక ప్రమాదాల్లో పదుల సంఖ్యలో మృత్యువాత పడుతున్నారు. విభజనాం ధ్ర ప్రదేశ్ భయాంధ్ర ప్రదేశ్ గా మారుతోంది. ఇటీవల బియాస్ నదిలో తెలుగు విద్యార్థులు 24 మంది చనిపోగా, చెన్నయ్ భవనం కుప్పకూలిన ఘటనలో 40 మంది కార్మికులు మృత్యువాత పడ్డారు. ఇదిలా ఉండగా ... ఇటీవల ముస్లి దేశాల్లో అక్కడి వాతావరణ పరిస్థితులు యుద్ధ వాతావరణం నెలకొన్న దృష్ట్యా అక్కడి మన తెలుగు వారిని రప్పించేందుకు ఇరు రాష్ర్టాల ముఖ్యమంత్రులు నారాచంద్రబాబు నాయుడు, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావులు ఆందోళన చెందుతున్న పరిస్థితి. నష్టపరిహారాలు లక్షల్లో చెల్లిస్తున్నారే తప్పా... ప్రమాదాలను పసిగట్టేలేని పరిస్థితి. ఎందుకంటే ఎప్పటినుంచో ప్రమాదాలు పొంచివున్నా వాటిని కనుగొనలేక పోవడమే ప్రమాదాలకు కారణమా? లాంటి వాటిపై ఉన్నతాధికారులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. నవ్యాంధ్రప్రదేశ్, బంగారు తెలంగాణ ప్రజలను సుఖ సంతోషాలతో ఉంచాల్సిన భాధ్యత రెండు ప్రభుత్వాలపై ఉంది. 
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment