ఉద్యోగుల కేటాయింపులపై కమలనాథన్ కమిటీ మార్గదర్శకాలు

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ర్టం రెండు రాష్ర్టాలుగా విడిపోయిన అనంతరం ఇరు రాష్ర్టాలకు ఉద్యోగుల కేటాయింపుల్లో సమానత్వం, స్థానికత ఆధారంగా ఉద్యోగుల కేటాయింపులపై కేంధ్ర ప్రభుత్వ వేసిన కమలనాథన్ కమిటీ ఉద్యోగులు ఎవరు ఎక్కడ విధులు నిర్వహించాలన్న అంశంపై పూర్తిగా పరిశోధన చేసిన అనంతరం శుక్రవారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల ఉద్యోగులకు కొన్ని మార్గ దర్శకాలను విడుదల చేసింది. దీనిపై ఎవరి అభిప్రాయాలు వారు పది రోజుల్లోగా వెల్లడించాల్సి ఉంటుందని కమిటీ పేర్కొంది.  ఒకటి రెండు సంవత్సరాల్లో పదవీ విరమణ చేసే వారు ఎక్కడ కావాలంటే అక్కడే ఉండవచ్చు. మహిళ, భార్య భర్తలకు సంబంధించి ఇరువురు ఎక్కడ ఉండాలంటే అక్కడ ఉండేవిధంగా కోరుకోవచ్చు. ఉద్యోగి మొదటి 7 సంవత్సరాల విద్యాభ్యాసం ఆధారంగానే స్థానికత అంశాన్ని గుర్తించబడుతుందని కమిటీ పేర్కొంది. మహిళలకు ముఖ్య ప్రాధాన్యతను ఇవ్వడం జరిగింది. వీటన్నింటిపై 10 రోజుల్లో తమ అభ్యంతరాలను తెలుపాల్సిందిగా ఒక నివేదికను విడుదల చేయడం జరిగింది. 
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment