కల్లు తాగండి బాబూ!


హైదరాబాద్లో 2004లో మూతపడ్డ కల్లు దుకాణాలను తిరిగి తెరిపించేందుకు తెలంగాణ సర్కారు సిద్ధమవుతోంది. దసరా పండుగలోగా వాటిని తెరిపించడానికి సన్నాహాలు చేస్తోంది. నగరంలోని కల్లు గీత కార్మిక కుటుంబాల ప్రయోజనం కోసం ఎన్నికల ముందు ఇచ్చిన హామీని కేసీఆర్ ప్రభుత్వం నెరవేరుస్తోంది. 50 కిలోమీటర్ల పరిధిలో చెట్లు లేనిచోట కల్లు విక్రయాలు జరపడం వల్ల అక్రమాలు జరుగుతున్నాయని, కల్లులో ప్రమాదకరమైన రసాయనాలు కలిపి విక్రయిస్తున్నారన్న ఆరోపణల  నేపథ్యంలోనే 2004లో హైదరాబాద్ జిల్లా పరిధిలో కల్లు దుకాణాలను మూసేశారు. కానీ గ్రేటర్ పరిధిలో ఉన్న రంగారెడ్డి జిల్లా, మెదక్ ప్రాంతాల్లో ఇప్పటికీ యథాతథంగా నడుస్తున్నాయి. ఏదెలా ఉన్నా హైదరాబాద్లో మళ్లీ కల్లు దుకాణాలు తెరుచుకోనున్నాయ్!!
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment