అలా చేసి ఉంటే నేను సీఎం అయి ఉండేవాడిని:జగన్

if so, i would be cm jagan

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై విపక్ష నాయకుడు వై.ఎస్.జగన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి కావడానికి ఏ గడ్డయినా తినేరకం చంద్రబాబు అని ఆయన ధ్వజమెత్తారు. తాను కూడా అబద్దపు హామీలు,మోసపూరిత వాగ్దానాలు చేసి ఉంటే ముఖ్యమంత్రి అయి ఉండేవాడినని ఆయన వ్యాఖ్యానించారు.అంతేకాక ఆయన కొన్ని మీడియా సంస్థలపై కూడా విమర్శలు కురిపించారు. చంద్రబాబు తప్పుడు వాగ్గానాలకు తోడు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ9 ఒక్కటై ప్రచారం చేసి ఆయన సీఎం. అయ్యేలా చేశాయని జగన్ అన్నారు.రుణాల విషయంలో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డ్వాక్రా మహిళల పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉందన్నారు. బాబు పూటకో అబద్ధం, రోజుకో మాట చెబుతున్నారని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు.ప్రజలకు చంద్రబాబు చేసిన మోసం ఇప్పుడిప్పుడే బయటపడుతోందని వైఎస్ జగన్ అన్నారు. గ్రామాల్లో టీడీపీ నేతలు తిరిగే పరిస్థితి లేదన్నారు.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment