కొత్త వెబ్‌సైట్ ప్రారంభించాడు :మోడీ


న్యూఢిల్లీ: దేశ పరిపాలనలో ప్రజలకు భాగస్వామ్యాన్ని కల్పించేందుకు తోడ్పడేలా సరికొత్త వెబ్‌సైట్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటై 60 రోజులైన సందర్భంగా శనివారం mygov.nic.in పేరిట ఈ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. ఈ వెబ్‌సైట్‌లో ప్రభుత్వ పాలనా అంశాలు, వివిధ పథకాలపై ప్రజలు తమ అభిప్రాయాలు, సూచనలు, సలహాలను వెల్లడించవచ్చు. ఎంతో మంది ప్రజలు ప్రభుత్వ పాలనలో భాగస్వామ్యం కోసం ఎదురుచూస్తున్నారని, వారు తమ సమయాన్ని, శక్తిసామర్థ్యాలను దేశానికి వినియోగించాలని భావిస్తున్నారని తన 60 రోజుల పాలనలో గుర్తించినట్లు ఈ సందర్భంగా ప్రభుత్వం విడుదల చేసిన ఒక ప్రకటనలో ప్రధాని మోడీ పేర్కొన్నారు. సుపరిపాలన కోసం ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య ఈ వెబ్‌సైట్ ఒక సమాచార మాధ్యమంగా ఉపయోగపడుతుంది.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment