కొండ చరియల కింద ఆ గ్రామం

28కి చేరిన మృతుల సంఖ్య
మహారాష్ర్ట: మహారాష్ర్ట లని పుణేజిల్లా అంబేగాన్ తాలుకాలోని మాళిణ్ గ్రామంలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 28కి చేరింది. ఘటనాస్థలాన్ని గురువారం ఉదయం కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ పరిశీలించారు. సహాయక చర్యలపై అధికారులతో సమీక్షించారు. బాధితులను కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. 400 మంది పోలీసు సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. దాదాపు 200 మంది వరకు శిథిలాల కింద చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో సహాయక చర్యలకు ఆటంకమేర్పడుతోంది. మృతుల సంఖ్య భారీగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. 
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment