మహేష్ బాబు నో అంటే సూర్య ఓకే

  mahesh babu no was surya ok

తెలుగు చిత్రపరిశ్రలో హీరో మహేష్ బాబుకు ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. స్టార్ దర్శకులందరూ  మహేష్ తో చిత్రం చేయాలని కలలు కంటూ ఉంటారు.  తమిళంలో మాస్ సినిమాల దర్శకుడిగా లింగు స్వామికి మంచి పేరుంది.   ఆయన మహేష్ బాబు వీరాభిమాని. ఆ విషయం ఆయనే స్వయంగా చెప్పారు. ఆయనతో సినిమా చేయాలన్నది లింగు స్వామి కోరిక.  ఆ మధ్య లింగు స్వామి 'అంజాన్' కథని మహేష్ కి చెప్పారు. ఆయన డేట్స్ కోసం తిరిగారు. ఫలితంలేదు.  చివరకు దాన్ని సూర్యతో చేశాడు. ఇప్పుడు మళ్లీ అలాంటిదే మరొకటి జరిగినట్లు సమాచారం. మనం చిత్రంతో హిట్ కొట్టిన విక్రమ్ కుమార్ తన తదుపరి చిత్రం మహేష్ తో చేయాలని అనుకున్నాడు. కథ సిద్దం చేసుకున్నారు. మహేష్ ని కూడా సంప్రదించినట్లు టాలీవుడ్ సమాచారం. ప్రిన్స్‌  డైరీ ఫుల్ బిజీగా ఉండటంతో మహేశ్ రిప్లై  ఇవ్వలేదని తెలుస్తోంది.

మహేష్‌ వదులకున్న మూవీని  సూర్య  చేయడానికి సిద్ధపడినట్లు సమాచారం. విక్రమ్ కుమార్‌ని సూర్య సంప్రదించినట్లు కోలీవుడ్ బోగట్టా. గతంలో విక్రమ్ తన 13 బి చిత్రం కోసం సూర్యని సంప్రదించారు. అయితే అప్పట్లో అది సాధ్యం కాకపోవడంతో మాధవన్ తో ముందుకి వెళ్లారు. ఇప్పుడు సూర్యయే పిలిచి అవకాశం ఇవ్వటంతో విక్రమ్‌ వెంటనే అంగీకరించినట్లు సమాచారం. ఈ కథతో తెలుగు, తమిళంలో ఒకే సారి చిత్రం నిర్మించాలన్న ఆలోచనతో  సూర్య ఉన్నట్లు తెలుస్తోంది.


Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment