Video Of Day

Breaking News

అమ్మ వేల్లివస్తం

mom-go-come

మెదక్  : ఎప్పటిలాగే తెల్లారింది... పిల్లలంతా చకచకా బడికి తయారయ్యారు.. అమ్మతోఅమ్మ వేల్లివస్తం అని చెప్పారు ... నాన్నకు టాటా బాయ్‌బాయ్ చెప్పారు... బిలబిలమంటూ బస్సులో ఎక్కారు... కాసేపట్లో బడికి చేరుకుంటామనుకుంటుండగానే మృత్యువు రైలు రూపంలో వచ్చింది. కాపలా లేని రైల్వే గేటు వద్ద పట్టాలను దాటుతున్న పాఠశాల బస్సును రైలు ఒక్కసారిగా ఢీకొట్టింది. 40 అడుగుల వరకు పట్టాలపై ఈడ్చుకెళ్లింది. అంతే... ముద్దు ముద్దు మాటలు చెప్పే బుజ్జాయిలు ఇనుప ముక్కల మధ్య మాంసపు ముద్దలుగా మారారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేట వద్ద జరిగిన ఈ ఘోర ప్రమాదంలో దాదాపు 20 మంది చినచిన్న పిల్లలు తిరిగి రాని లోకాలకు వెళ్లారు. మరో 18 నుంచి 20 మంది పిల్లలకు తీవ్రంగా గాయాలయ్యాయి.

No comments