విద్యార్ధులకు కాదు రైతులకు ఐపాడ్ లు :బాబు

no student of the farmers iPod Babu

ఇంతకుముందు విద్యార్ధులకు ఐపాడ్ లు ఇచ్చే విసయాన్ని పరిశీలిస్తున్నామని చెప్పిన చంద్రబాబు తాజాగా రైతులకు  ఐపాడ్ ఇస్తే ఎలా ఉంటుందో ఆలోచిస్తున్నామని అనడం విశేషం. రైతు సంఘాల వారు తనను కలిసిన సందర్భంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.పొలం పిలుస్తోంది అనే పేరుతో ఒక కార్యక్రమం చేపట్టాలని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. గత పదేళ్లలో కాంగ్రెస్ పార్టీ వ్యవసాయాన్ని నాశనం చేసిందని ఆయన ధ్వజమెత్తారు. రైతులకు అవసరమైన సమచారం అంటే విత్తనాలు మొదలు,ఎరువులు, సేద్యపు పద్దతులు,ఆధునిక పరిజ్ఞానం తదితర అంశాలపై ఈ కార్యక్రమం ద్వారా అవగాహన పెంచాలని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆంద్రప్రదేశ్ లో ప్రతి రైతుకు ఐపాడ్ ఇచ్చే ఆలోచన ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment