ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్దిని కోరుకుంటున్న సీఎం: శివరామకృష్ణన్

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎంపికపై ఆగష్టు 20 లోగా కేంద్రానికి తుది నివేదికను సమర్పిస్తామని, ఇదే విషయాన్ని చంద్రబాబుకు తెలిపామని శివరామకృష్ణన్ కమిటీ స్పష్టం చేసింది. శనివారం కమిటీ అధ్యక్షుడు శివరామకృష్ణన్ మీడియాతో మాట్లాడుతూ ఏపీ సమగ్రాభివృద్ధిని చంద్రబాబు కోరుకుంటున్నారని ఆయన చెప్పారు. ఏపీ అంతటా అనువైన భూములు దొరకడం కష్టంగా ఉందని శివరామకృష్ణన్ అన్నారు. ఇంకా ఐదు జిల్లాలో పర్యటించాల్సి ఉందని, వచ్చే పది రోజుల్లో ఆయా జిల్లాల్లో పర్యటిస్తామని ఆయన తెలిపారు. ఏపీలో వివిధ సంస్థల ఏర్పాటుకు 14 ప్రాంతాలను గుర్తించినట్లు వెల్లడించారు.
తమది కేవలం రాజధాని ఎక్కడో నిర్దేశించే కమిటీ కాదని, రాష్ట్రంలో ఎక్కడెక్కడ అభివృద్ధి చేయాలో సూచిస్తామన్నారు. ఏపీకి సంబంధించి 192 ఆఫీసులు హైదరాబాద్‌లో ఉన్నాయని చెప్పారు. కార్యాలయాల తరలింపు సంక్లిష్టమైన సమస్యగా శివరామకృష్ణన్ అభిప్రాయపడ్డారు. రాజధాని విషయంలో అనేక కోరికలు ఉంచవచ్చని, కోరికలు భూమిని ఇవ్వలేవని, భూమి లభ్యతనూ చూసుకోవాలని శివరామకృష్ణన్ తెలిపారు. ప్రతిఏటా 2 నుంచి 3 లక్షల ఉద్యోగాలు కావాలని, పాలకులు, అధికారులు ఉద్యోగాలు కల్పించలేరన్నారు. ఉద్యోగాలు కావాలంటే పరిశ్రమలు రావాలన్నారు. రాజధాని ఉంటే అద్భుత బిల్డింగ్‌లు కాదు....ప్రజలు, సర్వీసులని ఆయన పేర్కొన్నారు. భూసేకరణకు ఎక్కువ మొత్తం చెల్లించలేమన్న శివరామకృష్ణన్ వ్యవసాయ భూములు ఎక్కువభాగం సేకరించడం సరికాదని సూచించారు.
 

Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment