టీచరమ్మకు రాష్ట్రపతి పేరు తెలియదు!

పాట్నా: భారత రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ అట. బీహార్ గవర్నర్ ఏమో స్మృతీ ఇరానీనట. ఇంత తలతిక్క సమాధానాలు చెప్పింది ఏ నిరక్ష్యరాస్యుడో లేక చంటోడో కాదు. బీహార్ కు చెందిన ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయిని. కనీస తెలివితేటలు ఉన్నవారెవరైనా ఈ ప్రశ్నలకు వెంటనే ఠకీమని సమాధానం చెబుతారు. కానీ టీచరమ్మకు మాత్రం తెలియకపోవడం విడ్డూరం. రాష్ట్రపతి పేరు కూడా తెలియని ఆ స్కూల్ టీచర్ ఇక పిల్లలకు ఏం చదువు చెబుతుంది?
పాఠశాల తనిఖీకి వెళ్లిన జిల్లా కలెక్టర్ ప్రశ్నలకు టీచర్ చెప్పిన చెప్పిన సమాధానాలివి. అంతే కలెక్టర్ కు మైండ్ బ్లాక్ అయినంత పని అయింది. ఆయన వెంటనే విచారణకు ఆదేశించారు. మహిళా టీచర్ విద్యార్హతలు ఏమిటి? ఇంతకీ ఆమె ఏ ప్రామాణికం మీద ఉద్యోగం సంపాదించింది అన్న అంశాలపై నివేదిక ఇవ్వాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.

Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment