వెయిట్ లిఫ్టింగ్ లో మెరిసిన తెలుగమ్మాయి

గ్లాస్గో: కామన్వెల్త్ లో తెలుగు అమ్మాయి మెరిసింది. 2014 కామన్వెల్త్ గేమ్స్ లో భాగంగా శుక్రవారం జరిగిన వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో తెలుగు రాష్ట్రానికి చెందిన మత్స సంతోషి కాంస్య పతకం చేజిక్కించుకుంది. 53 కేజీల విభాగంలో జరిగిన పోటీలో సంతోషి మత్స ఆద్యంతం ఆకట్టుకుంది. మత్స సంతోషిది విజయనగరం జిల్లా నెలిమర్ల మండలం కొండవెలగడ. ఇదిలా ఉండగా, పతకం సాధిస్తుందనుకున్న మరో వెయిట్ లిఫ్టర్ స్వాతి సింగ్ నిరాశ పరిచింది. చివరి వరకూ భారత ఆశలను రెట్టింపు చేసినా.. నాల్గో స్థానానికే పరిమితమైంది.
 
నిన్న జరిగిన మహిళల 48 కేజీల విభాగం ఫైనల్లో సంజితా కుమ్‌చమ్ స్వర్ణం సాధించగా, మీరాబాయి చానురెండో స్థానంలో నిలిచి రజతంతో సరిపెట్టుకుంది. ఈ తాజా పతకాలతో భారత్ పతకాల సంఖ్య పదికి చేరింది.

Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment