జెడ్పీటీసీలపై అనర్హత తప్పదా?

స్థానిక పీఠాల పోరులో కాంగ్రెస్ విప్‌ను ధిక్కరించిన జెడ్పీటీసీలపై అనర్హత వేటు వేయించాలని టీపీసీసీ నిర్ణయించింది.  టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల ల క్ష్మయ్య మంగళవారం గాంధీభవన్‌లో పార్టీ క్రమశిక్షణా సంఘం ఛైర్మన్ ఎం.కోదండరెడ్డి, సభ్యుడు డి.వి.సత్యనారాయణలతో ఇదే అంశంపై సమావేశమయ్యారు. ప్రధానంగా వరంగల్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లో పార్టీ విప్‌ను ధిక్కరించిన వారిపై చర్య తీసుకునే విషయంపైనే ఎక్కువసేపు చర్చ జరిగింది. అనర్హత వేటు విషయంలో న్యాయపరంగా ఇబ్బందుల్లేకుండా అధ్యయనం చేసి ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయాలని పొన్నాల సూచించినట్లు తెలిసింది. రాజ్యసభ సభ్యుడు పాల్వాయిపై వచ్చిన ఫిర్యాదుపైనా సమావేశంలో చర్చించారు.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment