Video Of Day

Breaking News

ఆందోళన అక్కర్లేదు అంతా మంచే జరుగుతుంది


ఈ నెల 19న తెలంగాణలో నిర్వహించే సర్వే ఫైనల్ సర్వే కాదని, మరింత సరయిన సమాచారం కోసం శాఖల వారీగా ఆ తరువాత సర్వేలు నిర్వహిస్తామని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. ఈ సర్వేతో స్థానికతకు, ఫాస్ట్ పథకానికి ఎలాంటి సంబంధం లేదని, ఇది ఆర్థిక, సాంఘీక సర్వే మాత్రమేనని వెల్లడించింది. ఇతర రాష్ట్రాలలో, ఇతర దేశాలలో ఉన్నవారు ఆ రోజు సర్వేకు రావాల్సిన అవసరం లేదని, రాష్ట్రంలో ఉన్నవారు మాత్రం ఖచ్చితంగా ఇళ్లవద్ద ఉండాలని, హైదరాబాద్ తో సహా అన్ని జిల్లాలలో సర్వే జరుగుతుందని వెల్లడించారు. బయట ఉన్నవారికి ఎలాంటి ఆందోళన అవసరం లేదని, విద్యార్థులకు, ఉద్యోగ నిమిత్తం వెళ్లినవారికి మినహాయింపు ఉంటుందని వెల్లడించింది. సర్వే కు సంబంధించిన ఫార్మాట్ ను రేపటి వరకు వెబ్ సైట్లో పెడతామని వెల్లడించింది

No comments