మోడీ సర్కార్ రూ.5000 ఆఫర్


మోడీ సర్కార్ సామాన్యుడికి పంద్రాగస్టు సందర్భంగా నజరానా ప్రకటించింది. ఇందులో భాగంగా ఈ నెల 15వ తేదీన ప్రధాని మోడీ ‘కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ ఇంక్లూషన్’ అనే పేరుతో ఒక ప్రతి కుటుంబానికి రెండు బ్యాంక్ ఎకౌంట్స్
పథకాన్ని ప్రారంభిస్తారు. ఈ పథకంలో భాగంగా ఇకపై దేశంలోని ప్రతి కుటుంబానికి రెండు బ్యాంకు ఎకౌంట్స్ ఉండాలి. వచ్చే ఏడాదికళ్ళా ప్రతి కుటుంబలో భర్త పేరుతో ఒక ఎకౌంటు, భార్య పేరుతో ఒక ఎకౌంటు ఉండాలని కేంద్రం అన్ని రాష్ట్రాలకు ఆదేశాలను జారీ చేసింది. ఈ పథకంలో భాగంగా ప్రతి కుటుంబానికి ‘రూపే’ పేరుతో ఒక డెబిట్ కార్డుని అందచేస్తారు.
ఈ పథకానికి సంబంధించిన మరిన్ని ముఖ్య ఉద్దేశ్యాలను, లక్ష్యాలను కేంద్ర ఆర్ధిక శాఖ తాజాగా అన్ని రాష్ట్రాలకు పంపించింది. అందులో తెలిపిన వివరాల ప్రకారం 2015 ఆగస్టు 15లోగా ప్రజలందరికీ బ్యాంకు సేవలు అందుబాటులో ఉండాలనేది ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ఈ పథకం ద్వారా దేశంలోని ప్రతి కుటుంబానికి “రూపే” డెబిట్ కార్డుని అందిస్తారు. ఈ కార్డు ఉన్నవారికి రూ. లక్ష విలువైన భీమాతో పాటు రూ.5 వేల వరకు ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ అందుబాటులో ఉంటుంది. ఒక వేల ఓవర్ డ్రాఫ్ట్ సొమ్మును తిరిగి చెల్లించని పక్షంలో రుణపూచీకత్తు నిథిని కూడా ఏర్పాటు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment