Video Of Day

Breaking News

మోడీకి కెసిఆర్ లేఖ రాశారు


కేంద్ర హోం శాఖ రాసిన లేఖపై తీవ్రంగా మండిపడుతున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు తన అభ్యంతరాలను తెలియచేస్తూ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. హైదరాబాద్ పై గవర్నర్ కు అధికారాలు ఇవ్వడం ప్రజాస్వామ్య స్పూర్తికి విరుద్దమని ఆయన స్పష్టం చేశారు. హోం శాఖ రాసిన లేఖపై స్పందించి, దానిని ఉపసంహరించుకునేలా చర్యలు చేపట్టాలని కెసిఆర్ కోరారు.ప్రజాస్వామ్య సంప్రదాయాలను మోడీ కాపాడుతారన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు, మంత్రులు, ఎమ్.పిలు దీనిపై తీవ్రంగా స్పందిస్తూ ఖండనలు పెద్ద ఎత్తున ఇచ్చారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజివ్ శర్మతో హోం శాఖకు తిరుగు జవాబు ఇప్పించిన తెలంగాణ ప్రభుత్వం చివరికి స్వయంగా కెసిఆర్ స్వయంగా లేఖ రాయాలని నిర్ణయించి ఆ మేరకు లేఖ రాశారు.

No comments