ఎన్ పిఏలో విషాదం - ట్రైనీ ఐనీఎప్ ఐపిఎస్ మృతి

హైదరాబాద్‌  : నగరంలోని నేషనల్‌ పోలీస్‌ అకాడమీలో విషాదం నెలకొంది. హిమాచల్‌ కేడర్‌కు చెందిన ట్రైనీ ఐపీఎస్‌ మనోముక్త్‌ మానవ్‌ స్విమ్మింగ్‌ పూల్‌లో పడి గాయపడ్డాడు. దీంతో అతడిని అధికారులు చికిత్స నిమిత్తం బంజారాహిల్స్‌ కేర్‌ ఆస్పత్రికి తరలించారు. కాగా చికిత్స పొందుతూ మనోముక్త్‌ శుక్రవారం మృతి చెందాడు. మనోముక్త్‌ హర్యానా వాసి.  అయితే మనోముక్తి గురువారం రాత్రి తన మిత్రులతో కలిసి అర్ధరాత్రి వరకు పార్టీ చేసుకున్నట్లు, ఆ ఆనందంలో స్విమ్మింగ్ పూల్ లో మద్యం మత్తులో పడిపోయినట్లు, గమనించిన తన మిత్రులు సరదాగా ఈత కొడుతున్నట్లు భావించారని, కేకలు, అరుపులు పెట్టిన పట్టించుకోలేదని తెలిసింది. దీంతో ఊపిరాడక తను అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. గమనించిన కొందరు చికిత్స నిమిత్తం హుటాహుటీన హైదరాబాద్ లోని కేర్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సమాచారం. ఎన్ పి ఎ అధికారులు తన బంధువులు, తల్లిదండ్రులకు సమాచారం అందించారు. 
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment