రామ్‌గోపాల్‌వర్మ ఈ చిత్రాన్ని వేలం పాట వేస్తాడంట

 Ramgopalvarma this picture auction

మంచు విష్ణు కథానాయకుడిగా రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రానికి అనుక్షణం అనే టైటిల్‌ను ఖరారు చేశారు. అమ్మాయిలూ జాగ్రత్త అనేది ఉపశీర్షిక. తేజస్విని కథానాయిక. చిత్రీకరణ పూర్తయింది. వినూత్న కథాంశంతో సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. నవదీప్, మధుశాలిని కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగు చిత్రసీమలో సరికొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుడుతూ రామ్‌గోపాల్‌వర్మ ఈ చిత్రాన్ని వేలం పాట విధానంలో విడుదల చేయబోతున్నారు. గతంలో ఈ చిత్రానికి టెన్షన్ టెన్షన్ 12 అనే టైటిల్స్ పెట్టబోతున్నట్లు వార్తలు వచ్చాయి.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment