ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రెండు ముఖాల

 andhrajyothi-radhakrishna-his-two-faces

ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తన రెండు ముఖాలను ఎప్పుడూ దాచుకోలేదు. ఒకటి నేను తెలంగాణవాడినంటాడు. తెలంగాణవాదినంటాడు. రెండు  మనసావాచా కర్మణా సమైక్యవాదిలా, చంద్రబాబు మనిషిలా మాట్లాడతాడు, రాస్తాడు. గవర్నర్‌కున్న అధికారాలను రాష్ట్ర ప్రభుత్వం ధిక్కరించినట్టు, దానిపై కేంద్రం సీరియస్ అయినట్టు, రాజ్యాంగాన్ని అవమానించడంగా భావించినట్టు, అవసరమయితే చివరి ఆయుధంగా కేంద్ర పాలన విధించే అవకాశం ఉన్నట్టు... అక్కసు, అజీర్తీ, ఉక్రోషమూ కలబోసి కలనేసి రాధాకృష్ణ అల్లిన కల్లబొల్లి కథనాన్ని చూసి తెలంగాణవాదులు విస్తుపోతున్నారు.
ఎంఎస్‌వోలు (MSO-->Multiple System Operators) తమ వ్యాపారాన్ని పణంగా పెట్టి ఆత్మగౌరవాన్ని చాటుకుంటే తప్పట. వారు రాజకీయ పార్టీల చేతుల్లో పావులుగా మారినట్టట. మరి.. తమ పత్రికలు, పత్రికాధిపతులు మాత్రం ఒక రాజకీయ పార్టీకి, ప్రాంతీయ ఆధిపత్యానికి కీలుబొమ్మగా వ్యవహరించవచ్చా? ఈ మాత్రం జ్ణానం లేని ఈ విలువలేని మనుషులు పత్రికలు నడిపిస్తే ప్రజాస్వామ్యం బతికి బయటపడుతుందా? ఆంధ్రజ్యోతి-ఈనాడు ఇన్నేల్లుగా చేసింది 'కుల స్వామ్యం', తెలుగు దేశమనే తమ పార్టీకి అబద్దాల రాతలతో ప్రజలను తప్పుదోవ పట్టించి దొంగ దారుల్లో పదవులను పొందేందుకు ఊతమివ్వడం వీల్లు రోజూ చేసే పని.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment