రెండున్నర గంటలపాటు స్పీకర్ తో జగన్ వాగ్వాదం

హైదరాబాద్ : 
శాసన సభలో జగన్ ఒక్కరే మాట్లాడటంపై టీడీపీ సభ్యులు పలుమార్లు తమ అభ్యంతరం తెలిపారు. బడ్జెట్ పై చర్చ ప్రారంభమైన తర్వాత.... వైఎస్ జగన్ కు కేటాయించిన సమయం కన్నా అదనపు సమయం తీసుకోవడం పట్ల టీడీపీ సభ్యులు అభ్యంతరం తెలిపారు. దీనికి స్పందించిన స్పీకర్ కోడెల... జగన్ ఇప్పటికే గంటన్నర పైగా మాట్లాడారని... ఇక ప్రసంగాన్ని తొందరగా ముగించాలని కోరారు. అయితే, వైసీపీ సభ్యులు తమ సమయాన్ని కూడా జగన్ కే కేటాయించాలని సూచించారు. ఈ సూచనతో జగన్ కు మరికొంత సమయం మాట్లాడే అవకాశాన్ని స్పీకర్ కల్పించారు.
అయితే, జగన్ భాషణ సమయం రెండుగంటలు దాటిన తర్వాత టీడీపీ సభ్యులు మళ్లీ అభ్యంతరం తెలిపారు. బడ్జెట్ మీద జగన్ ఒక్కరే మాట్లాడుతున్నారని... తమకు కూడా అవకాశం కల్పించాలని వారు స్పీకర్ ను డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి మాట్లాడుతూ, బడ్జెట్ పై చర్చలో ఒక్క ఆర్థిక మంత్రి మాత్రమే ఎంత సమయమైనా మాట్లాడవచ్చని... మిగతా సభ్యులు నిర్ణయించిన సమయం ప్రకారమే మాట్లాడాలని నియమాలను గుర్తచేశారు. దీనికి ప్రతిగా వైసీపీ సభ్యులు తమ సభ్యుడికి ఇంకా సమయం కేటాయించాలని వెల్ లోకి దూసుకువచ్చారు. దీంతో మరో 15నిమిషాలు ప్రసంగించేందుకు జగన్ కు స్పీకర్ అవకాశమిచ్చారు. 
ఈసారి మరో 15నిమిషాలు మాట్లాడగానే... స్పీకర్ జగన్ ను ప్రసంగాన్ని ముగించాల్సింగా కోరారు. అయినా ఆయన ప్రసంగం ఆపకపోవడంతో... స్పీకర్ జగన్ మైక్ ను కట్ చేశారు. దీంతో వైసీపీ సభ్యలు ఆందోళనకు దిగి... పోడియంను చుట్టుముట్టి తమ నేతకు మరికొంత సమయం కేటాయించాలని ఆందోళన చేయడం మొదలుపెట్టారు. స్పీకర్ ఎంత వారించినప్పటికీ వైసీపీ సభ్యులు ఆందోళన విరమించకపోవడంతో స్పీకర్ సభను రేపటికి వాయిదా వేశారు. సభ జరిగిన పర్యంతం స్పీకర్ ప్రసంగాన్ని ముగించమన్నప్పుడల్లా... జగన్ ఆయనతో వాగ్వాదానికి దిగారు. జగన్ సభలో గౌరవంగా ఉండడం నేర్చుకోవాలని స్పీకర్ సూచించారు.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment