కాణిపాకం ఆలయంలోకి తుపాకితో వెళ్లిన నటుడు

చిత్తూరు : కాణిపాకం వినాయకస్వామిని నటుడు చరణ్‌రాజ్‌ శుక్రవారం ఉదయం దర్శించుకున్నారు. ఈ క్రమంలో కాణిపాకం దేవాలయంలో భద్రతా లోపాలు బయటపడ్డాయి. చరణ్‌రాజ్‌ తుపాకీతో ఆలయంలోకి వెళ్లినప్పటికీ ఆలయ భద్రతా సిబ్బంది పట్టించుకోలేదు. అయితే వినాయకమాల తీసే హడావుడిలో గుడిలోకి వెళ్లానని వివరణ ఇచ్చిన చరణ్‌రాజ్‌ ఆలయాధికారులు, ప్రజలు క్షమించాలని కోరారు. దీనిపై ఆలయ అధికారులను మీడియా వివరణ కోరగా చరణ్ రాజ్ తుపాకిని తీసుకెళ్లలేదని.. తన నడుంకు తుపాకి పోచ్ మాత్రమే ఉందని, దీనిపై రాద్దాంతం చేయాల్సిన అవసరం లేదని, ఆలయ కమిటీ సభ్యులు వివరణ ఇచ్చారు. 
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment