చైనా భూకంపం... 400కు చేరిన మృతుల సంఖ్య

బీజింగ్‌ : ఆదివారం సాయంత్రం చైనాలోని నైరుతి యున్నాన్‌ ప్రావిన్స్‌ను కుదిపేసిన భారీ భూకంపంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. భూకంపం దాటికి మరణించిన వారి సంఖ్య 400కు చేరింది. సహాయక చర్యల కోసం చైనా వేలకొద్దీ సైనికులు, పోలీసులు, అగ్నిమాపక సిబ్బందిని రంగంలోకి దించింది. ఆ దేశ ప్రధాని ప్రమాద స్థలానికి వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
గత పద్నాలుగేళ్లలో అక్కడ వచ్చిన భూకంపాల్లో
 ఇదే తీవ్రమైనదని అధికారులు పేర్కొంటున్నారు. కాగా, ప్రమాదంలో ఇంకా కొంతమంది ఆచూకీ లభించలేదు. 1801 మంది గాయపడ్డారు. ఝావోటాంగ్‌, క్యుజింగ్‌ నగరాల్లోని పది లక్షల మంది పౌరులపై భూకంపం పెనుప్రభావమే చూపింది. దీని ప్రభావంతో 2,30,000 మంది నిరాశ్రయులయ్యారని యున్నాన్‌ పౌర సరఫరాల శాఖ వెల్లడించింది. ప్రకంపనల దాటికి 80 వేల ఇళ్లు నేలమట్టవగా, 1,24,000 వేల ఇళ్లు ధ్వంసమయ్యాయని తెలిపింది.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment