Video Of Day

Breaking News

విద్యుత్ కోతలను నిరసిస్తూ తెలంగాణలో ఆందోళనలు

మెదక్ : విద్యుత్ కోతలను నిరసిస్తూ తెలంగాణలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. మెదక్ జిల్లా నార్సింగ్‌లో సోమవారం కూడా రైతులు రాస్తారోకో నిర్వహించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను రైతులు దహనం చేశారు. పోలీసులు లాఠీ చార్జీ చేయడంతో 10 మంది రైతులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఆగ్రహం చెందిన రైతులు పోలీస్ వాహనాలపై రాళ్లు రువ్వారు. రామాయంపేట సీఐ గంగాధర్‌పై రైతులు దాడి చేశారు. జిల్లాలోని రాస్‌పల్లి, ఛండీ గ్రామాల సబ్ స్టేషన్ల ఎదుట కూడా రైతులు ఆందోళనకు దిగారు.
మరోవైపు వరంగల్ జిల్లా రాయపర్తి విద్యుత్ సబ్ స్టేషన్‌ను రైతులు ముట్టడించారు. నల్గొండ జిల్లా నూతనకల్, మిర్యాలగూడ సబ్ స్టేషన్ల ఎదుట రైతులు ధర్నాకు దిగారు. పంట పొలాలకు విద్యుత్ కోతలు ఎత్తివేయాలని రైతులు డిమాండ్ చేశారు.

No comments