ఖైరతాబాద్ గణేశుడ్ని దర్శించుకుంటే పాపాలు తొలగుతాయి ; గవర్నర్

హైదరాబాద్: గవర్నర్‌గా ఐదో సంవత్సరం ఖైరతాబాద్‌ వినాయకుడిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని ఈఎస్ఎల్ నరసింహన్ అన్నారు. వినాయక చవితి పర్వదినం సందర్భంగా శుక్రవారం ఉదయం సతీసమేతంగా ఖైరతాబాద్ మహాగణనాథుడిని దర్శించుకున్నారు. 60 అడుగుల శ్రీ కైలాస విశ్వరూపమహాగణపతికి ప్రథమపూజ చేశారు.
వినాయక చవితి రోజు ఖైరతాబాద్ గణేషుడిని దర్శించుకుంటే సర్వవిజ్ఞాలు తొలగిపోతాయని ఈ సందర్భంగా గవర్నర్ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ప్రజలకు ఆయన వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు భారీ గణనాథుడిని దర్శించుకునేందు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. గవర్నర్ నరసింహన్ దంపతులకు ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ సభ్యులు, స్థానిక కార్పొరేటర్ మహేష్ యాదవ్, వేద పండితులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గవర్నర్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇరు తెలుగు రాష్ర్టాల ప్రజలకు గవర్నర్ వినాయకచవితి శుభాకాంక్షలు తెలిపారు. 
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment