భారత్‌కు ‘ఐరాస’ బాసట!

ముందు తిండి..ఆ తర్వాతే ఉద్యోగం
డబ్ల్యూటీవోపై తేల్చిచెప్పిన ఐఎఫ్‌ఏడీ అధిపతి
న్యూఢిల్లీ : ఆహార భద్రత విషయంలో భారత్‌ వాదనకు అంతర్జాతీయంగా మద్దతు పెరుగుతున్నది. అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాల (డబ్ల్యూటీవో) కన్నా దేశ ప్రజలకు తిండి పెట్టడమే తమకు ప్రధానమన్న మోదీ ప్రభుత్వ దృఢ వైఖరిని ఐక్యరాజ్యసమితి అనుబంధ వ్యవసాయ అభివృద్ధి విభాగం ‘ఐఫీఏడీ’ సమర్థించింది. అభివృద్ధి చెందిన దేశాలకు అనుకూలంగా ఉన్నదంటూ డబ్ల్యూటీవోకు సంబంధించిన వాణిజ్య సదుపాయల ఒప్పందం (టీఎఫ్‌ఏ)పై సంతకం చేసేందుకు గత వారం భారత ప్రభుత్వం నిరాకరించిన విషయం తెలిసిందే.
ఆహార  భద్రతకి హామీపడే ఏ అంశమూ నిర్దిష్టంగా ఒప్పందంలో లేకపోవడం
పై అభ్యంతరం వ్యక్తం చేసింది. భారత్‌ వాదన పలు అంతర్జాతీయ సంస్థలను ఆలోచనలో పడేసిన నేపథ్యంలో ‘ఐఎఫ్‌ఏడీ’ సంస్థ అధ్యక్షుడు కెనయో న్వాన్జే స్పందించారు. నిర్దిష్టంగా కొన్ని దేశాల్లో ఉద్యోగితని పెంచే ప్రయత్నం కన్నా కూడా దేశ ప్రజలకు ఆహార భద్రతని హామీ పడటమే అతి ముఖ్యమని వ్యాఖ్యానించారు. భారత్‌ ఉన్న స్థితిలో తానున్నా అదే వైఖరిని ప్రదర్శించేవాడినని ఆయన తేల్చి చెప్పారు.
‘ప్రజలు ఆకలితో మాడుతున్నప్పుడు ‘ఉద్యోగిత’పై మొండిగా వ్యవహరించడం వివేకం అనిపించుకోదు. కుటుంబానికి తిండి పెట్టడమా లేక ఉద్యోగాలు కల్పించడమా అనే సమస్య ఎదురయితే నేను గానీ, మీరు గానీ ఏమి చేస్తాం?’’ అని కెనయో ప్రశ్నించారు. ఏ ఒప్పందాన్ని ఖరారు చేయాలన్నా 120 కోట్ల భారత జనాభాని ముందుగా దృష్టిలో ఉంచుకోవాల్సి ఉంటుందని ‘ఐఎఫ్‌ఏడీ’ భారత విభాగం డైరెక్టర్‌ నిగేల్‌ బ్రెట్‌ అభిప్రాయపడ్డారు.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment