Video Of Day

Breaking News

కేసీఆర్‌ పర్యటనకు నిరసనగా టీయూ బంద్‌

డిచ్‌పల్లి (నిజామాబాద్‌)  సీఎం కె. చంద్రశేఖర్‌ రావు నిరంకుశ పాలన పాలన కొనసాగిస్తున్నారని ఆరోపిస్తూ గురువారం ని జామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లిలోని తెలంగాణ విశ్వవిద్యాలయ విద్యార్థులు వర్సిటీ బంద్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా తరగతులను బ హిష్కరించిన విద్యార్థులు.. అధ్యాపకులు బోధన చేయకుండా వర్సిటీ బంద్‌కు సహకరించాల ని డిమాండ్‌ చేయడంతో తరగతులు జరగలేదు. అనంతరం విద్యార్థి సంఘ నాయకులు మాట్లాడుతూ.. కాంట్రాక్టు లెక్చరర్లను క్రమబద్ధీ కరించడాన్ని నిరసిస్తూ ఉద్యమం చేస్తున్న ఓయూ విద్యార్థులను అరెస్టు చేయడం హేయమైన చర్య అని అన్నారు. సీఎం కేసీఆర్‌ కూడా ఆంధ్ర బాబుల పాలననే కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. కాంట్రాక్టు వ్యవస్థఉ క్రమబద్దీకరిస్తే తాము అన్యాయానికి గురవుతామన్నారు.
వెంటనే సీఎం. కవ్వింపు ప్రకటనలు మానుకోవాలని, అరెస్టు చేసిన ఓయూ విద్యార్థులను విడుదల చేసేలా ఆదేశాలు జారీ చేయాలని డి మాండ్‌ చేశారు. అనంతరం వర్సిటీ ప్రధాన ద్వారం ఎదుట విద్యార్థులు బైఠాయించారు. ప్లకార్డులతో నిరసన తెలుపుతూ కేసీఆర్‌కు వ్య తిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు విద్యార్థులను జాతీయ రహదారిపైకి రా కుండా ప్రధాన ద్వారం వద్దే అడ్డుకోవడంతో.. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. భారీగా మోహరించిన పోలీసులు విద్యార్థి నాయకులను బలవంతంగా వాహనంలో ఎక్కిం చుకుని పోలీసు స్టేషన్‌లకు తరలించారు.  ఈ ఆందోళనలో ఎన్‌ఎస్‌యుఐ, ఏబీవీపీ, పీడీఎస్‌ యు నాయకులు సంతోష్‌గౌడ్‌, నవీన్‌, రాజ్‌కుమార్‌, బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

No comments