మొగుడిగా సినిమాటోగ్రాఫర్ బెటరంటున్న తెలుగు హీరోయిన్

Actress-Priyamani-marraige-cinematographer
జగపతిబాబు పెళ్లైన కొత్తలో, జూనియర్ ఎన్టీఆర్ తో యమదొంగ, గోలీమార్ లో గోపీచంద్ తో నటించిన హాట్ హీరోయిన్ ప్రియమణి.. మొగుడిగా సినిమాటోగ్రాఫర్ బెటరంటోంది. తన అందాల ఆరబోతతో తెలుగు, తమిళ, కన్నడ, మళయాళీ ప్రేక్షకులను కిక్కెంచిన ఈ అందగత్తె చేతిలో ప్రస్తుతానికి సినిమాలేమీ లేవు. జగపతిబాబుతో ఎఫైర్ నడుపుతుందని అప్పట్లో వార్తలు గుప్పుమన్నాయి. జగపతిబాబు కూడా రెండు, మూడు అవార్డుల ఫంక్షన్స్ లో తనకు అత్యంత ఇష్టమైన హీరోయిన్ ప్రియమణి అని తన ప్రేమ చాటుకున్నాడు. అయితే తాజాగా తన లైఫ్ పార్టనర్ గురించి ఓ క్లూ ఇచ్చేసింది. తనకు కాబోయే భర్త సినిమాటోగ్రాఫర్ అయితే బాగుంటుందని వెల్లడించింది. కొద్దిరోజుల కిందట ఓ తమిళ డైరెక్టర్‌తో డేటింగ్ చేస్తోందంటూ ఈమె గురించి రకరకాలుగా వార్తలొచ్చాయి. ఐతే వాటిని ఆమె ఏనాడూ ఖండించలేదు.. అవసరం వచ్చినప్పుడు చెబుతానంటూ తప్పించుకునే ప్రయత్నం చేసింది. అంతేకాదు ఓ బిజినెస్‌మేన్‌తో లైఫ్‌లో సెటిల్ కాబోతుందన్న ప్రచారమూ సాగింది. రీసెంట్‌గా హైదరాబాద్‌లోని తాజ్‌బంజారా హోటల్‌లో మీడియాతో మాట్లాడిన ప్రియమణి, మనసులోని మాటను బయటపెట్టేసింది. బిజినెస్‌మేన్‌ని మ్యారేజ్ చేసుకుని సెకండ్ వైఫ్‌గా వుండే బదులు సినిమాటోగ్రాఫర్‌ని పెళ్లిని చేసుకుని మొదటి భార్యగా వుండటమే బెటరని చెప్పుకొచ్చింది. ఇదే తన లక్ష్యమని, త్వరలోనే దీనికి సంబంధించి డీటేల్స్‌ని వెల్లడిస్తానని తెలియజేసింది. ఈ లెక్కన ఈమె కేరళకు చెందిన ఓ సినిమాటోగ్రాఫర్‌తో సెటిల్ అవ్వాలని అనుకున్నట్టు ఇండస్ర్టీలో చర్చించుకుంటున్నారు.

Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment