Video Of Day

Breaking News

నాకింకా పెళ్లి వయసు రాలేదు

'సీతమ్మ' అదేనండి.. అంజలి.. ఇటీవల నటించిన సినిమా గీతాంజలి మంచి విజయం సాధించింది. దీంతో ఇప్పుడిప్పుడే మంచి అవకాశాలు చేజిక్కుంటోంది.. ఈ కోనసీమ లేతకొబ్బరి. అయితే ఈ మధ్య అమ్మడు పెళ్లి చేసుకోనుందని వార్తలు వచ్చాయి. తాజాగా అంజలి.. ఇప్పుడే పెళ్లి చేసుకునేది ఉద్దేశం లేదని తేల్చిచెప్పేసింది. ముందు కెరీర్ చూసుకోవాలని, అందుకే తొందరగా పెళ్లి చేసుకోవాలని అనుకోవట్లేదని ఆమె తెలిపింది. తన పెళ్లి విషయంలో ఇప్పటివరకు వస్తున్నవన్నీ రూమర్లేనని కూడా స్పష్టం చేసింది. ఒక వ్యాపారవేత్తతో తన పెళ్లి జరగబోతున్నట్లు కొన్ని వదంతులు వచ్చాయని, అయితే అవేవీ వాస్తవం కాదని అంజలి చెప్పింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ వయసు 28 ఏళ్లు.

No comments