మూగబోయిన 'మాండలిన్'

Mandolin-Srinivas-Died
మాండలిన్ వాద్యంతో ఆసేతు హిమాచలాన్ని ఓలలాడించిన సంగీత శిఖరం మాండలిన్ శ్రీనివాస్ (45) కన్నుమూశారు. ఆయన అసలు పేరు ఉప్పలపు శ్రీనివాస్. సొంత ఊరు పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లు. కాలేయ వ్యాధితో చెన్నైలోని ఒక ఆస్పత్రిలో చేరిన ఆయన సెప్టెంబర్ 19న తుదిశ్వాస విడిచారు. ఆయనకు తండ్రి, సోదరుడు, భార్య, కుమారుడు ఉన్నారు. తొమ్మిదేళ్ల వయసులోనే తొలి కచేరి ఇచ్చి అందరితో ఔరా అనిపించారు. మాండలిన్ ను కర్ణాటక సంగీతానికి జోడించి.. దాని విలువను ఎవరెస్ట్ శిఖరం స్థాయికి చేర్చారు. దేశీయ, విదేశీ సంగీత దిగ్గజాలతో కలిసి ఎన్నో కచ్చేరీలు చేశారు. చెన్నైలో స్థిరపడిన ఆయనను 1984లో నాటి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంజీఆర్.. ఆ రాష్ర్ట సంగీత ఆస్థాన సంగీత విద్యాంసుడిగా నియమించారు. 29 ఏళ్ల చిన్న వయసులోనే భారత ప్రభుత్వం అందించే పద్మశ్రీ అవార్డు అందుకుని రికార్డు సృష్టించారు. ఇంకా మాండలిన్ నే ఇంటిపేరుగా మార్చుకున్న ఆయనను మరెన్నో ప్రతిష్టాత్మక అవార్డుల వరించాయి.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment