మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన


Prithviraj-Chavan-president-rule-in-maharastra

మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రపతి పాలనకు కేంద్ర కేబినెట్  శనివారం సిఫారసు చేయగా.. ఆదివారం రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ దానికి ఆమోదం తెలిపారు. ముఖ్యమంత్రి పదవికి పృథ్వీరాజ్ చవాన్ రాజీనామా చేసిన రెండు రోజుల తర్వాత మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించారు. కాంగ్రెస్‌తో 15 ఏళ్ల దోస్తీకి ఎన్సీపీ రాంరాం చెప్పడంతో డెమోక్రటిక్ ఫ్రంట్ ప్రభుత్వం మైనార్టీలో పడిపోయింది. రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి సీట్ల పంపకంలో కాంగ్రెస్, ఎన్సీపీ మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. బీజేపీతో ఎన్సీపీ కుమ్మక్కై రాష్ట్రపతి పాలన వచ్చేలా చేసిందని పృథ్వీరాజ్ చవాన్ ఆరోపించారు. ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న దురుద్దేశంతోనే రెండు పార్టీలు చేతులు కలిపాయని విమర్శించారు. రాష్ట్రపతి పాలన విధించడాన్ని కాంగ్రెస్ తప్పుబట్టింది. రాష్ట్రంలోని నాలుగు ప్రధాన పార్టీలు ఎవరికి వారే పోటీ చేస్తుండటంతో ఎవరికి మెజార్టీ వస్తుందన్న ఆసక్తి నెలకొంది. ఏడు వేలకు పైగా నామినేషన్లు: అక్టోబర్ 15న జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం మొత్తం 7666 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. చివరి రోజు శనివారం పృథ్విరాజ్ చవాన్‌తో పాటు మాజీ హోంమంత్రి ఆర్‌ఆర్ పాటిల్ నామినేషన్లు వేశారు.

Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment